Press "Enter" to skip to content

Telangana

తెలంగాణలో రేపటి నుంచే రేషన్ బియ్యం పంపిణీ..

తెలంగాణలో రేపటి నుంచే రేషన్ బియ్యం పంపిణీ..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు రేషన్ బియ్యం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో.. పౌరసరఫరాల శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బియ్యాన్ని పంపిణీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో 1.09 కోట్ల కుటుంబాలు ఉండగా 87.59 లక్షల కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీరిలో ఒక్కో లబ్ధిదారుడికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు. దీంతో.. బియ్యాన్ని క్షేత్రస్థాయికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 3.36 లక్షల టన్నుల బియ్యం తరలించనున్నారు. దీని కోసం రాష్ట్ర ఖజానాపై రూ. 1,103 కోట్ల ఆర్థిక బారం పడుతోంది.