శ్రీ దక్ష ( 7 వ తరగతి బాలుడు )


భయం

చీకటి అంటే భయం.. ఆ నీశీధి నా వాళ్ళని తనలో దాచేస్తుందేమో అని..
నిద్ర అంటే భయం.. నన్ను నిద్రపుచ్చి నా వాళ్ళు అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతారేమో అని..
ఆకాశం అంటే భయం.. నా వాళ్ళు అందరూ రెక్కలు కట్టుకుని ఆ గగన తలానికి ఎగిరిపోతారేమో అని..
గాలి అంటే భయం.. సుడిగుండమయి వచ్చి నా వాళ్ళని చుట్టేస్తుందేమో అని..
నీరు అంటే భయం… ఉప్పెనయి వచ్చి నా వాళ్ళని అందరినీ ఆ జలవాహిని మింగేస్తుందేమో అని..
మొత్తానికి పంచభూతాలు అంటే భయం.. ఈ ప్రపంచం నుండి నా ప్రపంచాన్ని దూరం చేస్తాయేమో అని…
అందుకే చీకటిని చూస్తూ.. నిద్రపోకుండా.. ఆకాశంకేసి చూస్తూ చల్లని గాలికి వణుకుతూ .. వచ్చే పిచ్చి ఆలోచనకి భయపడి.. చల్లని నీరు తాగి….

ఈ జీవన పయనం లో మరో రోజు ప్రారంభం..
మరో భయం లేని రోజు కోసం ఎదురు చూస్తూ

. . . మంజీర